గుడ్డు పులుసు రెసిపీ, ఎగ్ పులుసు, Egg Pulusu Recipe Telugu, గుడ్డు పులుసు ఎలా చేయాలి, రెస్టారెంట్ స్టైల్ గుడ్డు పులుసు, చిక్కటి గ్రేవీ గుడ్డు పులుసు, Egg Curry Recipe Telugu, గుడ్డు కర్రీ తెలుగు, Easy Egg Pulusu Recipe, Homemade Egg Pulusu.egg-pulusu-recipe-telugu restaurant-style-guddu-pulusu easy-egg-pulusu-recipe guddu-pulusu-step-by-step
  • Home
  • Egg Recipes
  • ఎగ్ పులుసు రెసిపీ తెలుగు | ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గుడ్డు పులుసు

ఎగ్ పులుసు రెసిపీ తెలుగు | ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గుడ్డు పులుసు

కొన్ని కర్రీల రుచులు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటి వంటకాలలో గుడ్డు పులుసు ఒకటి. తక్కువ పదార్థాలతో, సులభమైన విధానంలో చేసినా అద్భుతమైన రుచి అందించే ఈ రెసిపీని చిన్న చిన్న చిట్కాలతో మరింత రుచిగా తయారు చేయవచ్చు. ఈ విధంగా చేస్తే గ్రేవీ చిక్కగా వచ్చి, గుడ్లలో మసాలా బాగా పట్టి ప్రతి ముక్క ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో గుడ్డు పులుసు చేయాలనుకుంటే, ఈ రెసిపీలో చెప్పిన ప్రతి స్టెప్‌ను అలాగే పాటించండి. సింపుల్‌గా తయారయ్యే ఈ ఎగ్ పులుసు రెసిపీ ఒక్కసారి చేసిన తర్వాత మళ్లీ మళ్లీ ఇదే విధంగా చేసుకోవాలనిపించేంత రుచిగా ఉంటుంది.

గుడ్డు పులుసు రెసిపీ, ఎగ్ పులుసు, Egg Pulusu Recipe Telugu, గుడ్డు పులుసు ఎలా చేయాలి, రెస్టారెంట్ స్టైల్ గుడ్డు పులుసు, చిక్కటి గ్రేవీ గుడ్డు పులుసు, Egg Curry Recipe Telugu, గుడ్డు కర్రీ తెలుగు, Easy Egg Pulusu Recipe, Homemade Egg Pulusu.egg-pulusu-recipe-telugu restaurant-style-guddu-pulusu easy-egg-pulusu-recipe guddu-pulusu-step-by-step

గుడ్డు పులుసు తయారికి కావలసిన పదార్థాలు :-

  • గుడ్లు – 6
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్ (గుడ్లు డికించడానికి)
  • నిమ్మకాయ వక్క – (గుడ్లు ఉడికించేటప్పుడు)
  • చింతపండు – చిన్న నిమ్మకాయ సైజు
  • టమాటాలు – 3 (పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  • ఎర్ర ఉల్లిపాయలు – 6
  • ఉల్లిపాయలు – 3 పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి
  • ఉల్లిపాయలు – 3 సన్నగా తరిగుకోవాలి
  • పచ్చిమిర్ – 3 చి (నిలువుగా చీల్చినవి)
  • నూనె – అర కప్పు
  • జీలకర్ర – కొద్దిగా
  • ఎండుమిర్చి
  • ఆవాలు – ½ టేబుల్ స్పూన్
  • శనగపప్పు – (తాలింపుకు)
  • కొద్దిగా కరివేపాకు
  • పసుపు – ½ టేబుల్ స్పూన్
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్ (గ్రేవీ కోసం)
  • కారం పొడి – 2 నుండి 2½ టేబుల్ స్పూన్లు
  • తగినంత నీరు
  • కొద్దిగా ధనియాల పొడి
  • చికెన్ మసాలా లేదా వెజ్ మసాలా

గుడ్డు పులుసు తయారీ విధానం :-

స్టెప్ 1:

ముందుగా ఒక గిన్నెలో 6 గుడ్లు వేసి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు కొద్దిగా నిమ్మ పచ్చి వేసి నీటితో ఉడికించండి. గుడ్లు బాగా ఉడికిన తర్వాత పొట్టు తీసి, ప్రతి గుడ్డుకు చిన్న చిన్న గాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి.

స్టెప్ 2:

చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టండి. తర్వాత రసం తీసుకుని సిద్ధంగా ఉంచుకోండి.

స్టెప్ 3:

3 టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేయండి. 6 ఎర్ర ఉల్లిపాయల్లో 3 ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసి, మిగిలిన 3 ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి సిద్ధంగా ఉంచండి.

స్టెప్ 4:

బాణలిలో అర కప్పు నూనె వేసి వేడయ్యాక ఉడికించిన గుడ్లను వేయండి. పసుపు లేదా కారం వేయకుండా సుమారు ఒక నిమిషం మాత్రమే స్వల్పంగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టండి.

స్టెప్ 5:

అదే నూనెలో పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. తర్వాత పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు మరియు కొద్దిగా జీలకర్ర వేసి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించండి.

స్టెప్ 6:

డబుల్ ఎగ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, Egg Noodles Recipe, Double Egg Noodles, Noodles Recipe Telugu, Fast Food Recipes, Street Food Recipes, Homemade Noodles, Easy Dinner Recipe, Telugu Recipes, Egg Recipes, Fast Food Style Noodles, Quick Recipes, Indian Noodles, Food Recipes Telugu
ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ స్టైల్ డబుల్ ఎగ్ నూడిల్స్

మరో బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించండి. ఉల్లిపాయల రంగు మారిన తర్వాత ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

స్టెప్ 7:

ఇప్పుడు అదే బాణలిలో ½ టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు మరియు కరివేపాకు వేసి తాలింపు సిద్ధం చేయండి. తర్వాత ½ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి.

స్టెప్ 8:

ఇప్పుడు ముందుగా సిద్ధం చేసిన చింతపండు రసం పోసి సుమారు 3 నిమిషాలు మరిగించండి. దీంతో చింతపండు పులుపు బాగా కలిసిపోతుంది.

స్టెప్ 9:

చింతపండు రసం మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు 2 నుండి 2½ టేబుల్ స్పూన్లు కారం వేసి బాగా కలపండి.

స్టెప్ 10:

ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన ఉల్లిపాయ–టమాటా మసాలా పేస్ట్‌ను వేసి బాగా కలపండి. గిన్నెలో కొద్దిగా నీరు పోసి కడిగి అదే నీటిని కూడా కూరలో వేసి, తక్కువ మంటపై సుమారు 5 నిమిషాలు ఉడికించండి. గ్రేవీపై నూనె కనిపించే వరకు మగ్గనివ్వండి.

స్టెప్ 11:

ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను గ్రేవీలో వేసి నెమ్మదిగా కలపండి. గుడ్లకు గ్రేవీ బాగా పట్టే వరకు కొద్దిసేపు ఉడికించండి.

స్టెప్ 12:

చివరగా కొద్దిగా ధనియాల పొడి వేయండి. మీ ఇష్టానికి అనుగుణంగా చికెన్ మసాలా లేదా వెజ్ మసాలా కూడా కలపవచ్చు. మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.

ఎగ్ మసాలా కర్రీ రెసిపీ, ఎగ్ కర్రీ రెసిపీ తెలుగులో, డాబా స్టైల్ ఎగ్ మసాలా, పెప్పర్ ఎగ్ మసాలా కర్రీ, Egg Masala Curry Recipe Telugu, Dhaba Style Egg Curry, హోటల్ స్టైల్ ఎగ్ కర్రీ, Egg Curry Recipe in Telugu, స్పైసీ ఎగ్ కర్రీ, ఎగ్ గ్రేవీ రెసిపీ, Egg Masala Recipe, గుడ్డు కర్రీ రెసిపీ, గుడ్డు మసాలా కర్రీ, Easy Egg Curry Telugu, Pepper Egg Curry Recipe
డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ | రుచికరమైన ఎగ్ కర్రీ రెసిపీ

గుడ్డు పులుసు తయారీలో ఉపయోగపడే చిట్కాలు :-

  • గుడ్లు ఉడికించే నీటిలో కొద్దిగా నిమ్మకాయ వక్క వేస్తే గుడ్డు పొట్టు చాలా సులభంగా వస్తుంది. దీంతో గుడ్లు పగలకుండా శుభ్రంగా తీసుకోవచ్చు.
  • చిన్న నిమ్మకాయ సైజులో తీసుకున్న చింతపండు సరిపోతుంది. ఎక్కువగా వేస్తే పులుసులో పులుపు అధికంగా వస్తుంది.
  • చింతపండు రసం వేసిన తర్వాత కొన్ని నిమిషాలు మరిగించండి. దీంతో పులుపు బాగా కలిసిపోయి గ్రేవీ రుచిగా తయారవుతుంది.
  • గ్రైండ్ చేసిన మసాలా కలిపిన తర్వాత తక్కువ మంటపై ఉడికించండి. గ్రేవీపై నూనె కనిపించే వరకు మగ్గిస్తే మంచి చిక్కదనం వస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు :-

1. గుడ్లు ఉడికించేటప్పుడు నిమ్మ పచ్చి ఎందుకు వేయాలి?

జ. గుడ్లు ఉడికించే నీటిలో కొద్దిగా నిమ్మ పచ్చి వేయడం వల్ల గుడ్డు పొట్టు చాలా సులభంగా వస్తుంది.

2. చింతపండు ఎంత వేయాలి?

జ. చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని కొద్దిగా మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువగా వేస్తే పులుసులో పులుపు ఎక్కువ అవుతుంది.

3. కారం మరియు ఉప్పు ఎప్పుడు వేయాలి?

జ. చింతపండు రసం బాగా మరిగిన తర్వాత కారం మరియు ఉప్పు వేయాలి. ఇలా చేస్తే రుచి బాగా కలుస్తుంది.

4. గుడ్లకు గాట్లు ఎందుకు పెట్టాలి?

జ. ఉడికించిన గుడ్లకు చిన్న చిన్న గాట్లు పెడితే గ్రేవీ రుచి గుడ్లలోకి బాగా చేరుతుంది.

5. గుడ్డు పులుసు గ్రేవీ చిక్కగా రావాలంటే ఏమి చేయాలి?

జ. మసాలా వేసిన తర్వాత తక్కువ మంటపై బాగా మగ్గించాలి. గ్రేవీపై నూనె కనిపించే వరకు ఉడికిస్తే చిక్కగా తయారవుతుంది.

6. గుడ్డు పులుసును దేనితో సర్వ్ చేస్తే బాగుంటుంది?

జ. ఈ గుడ్డు పులుసు వేడి అన్నం లేదా చపాతీతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది. చిక్కగా ఉండే గ్రేవీ రెండింటికీ బాగా సరిపోతుంది.

Latest Recipes

Leave a Reply