ఎగ్ మసాలా కర్రీ రెసిపీ, ఎగ్ కర్రీ రెసిపీ తెలుగులో, డాబా స్టైల్ ఎగ్ మసాలా, పెప్పర్ ఎగ్ మసాలా కర్రీ, Egg Masala Curry Recipe Telugu, Dhaba Style Egg Curry, హోటల్ స్టైల్ ఎగ్ కర్రీ, Egg Curry Recipe in Telugu, స్పైసీ ఎగ్ కర్రీ, ఎగ్ గ్రేవీ రెసిపీ, Egg Masala Recipe, గుడ్డు కర్రీ రెసిపీ, గుడ్డు మసాలా కర్రీ, Easy Egg Curry Telugu, Pepper Egg Curry Recipe
  • Home
  • Egg Recipes
  • డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ | రుచికరమైన ఎగ్ కర్రీ రెసిపీ

డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ | రుచికరమైన ఎగ్ కర్రీ రెసిపీ

ఎగ్ మసాలా కర్రీ రెసిపీ, ఎగ్ కర్రీ రెసిపీ తెలుగులో, డాబా స్టైల్ ఎగ్ మసాలా, పెప్పర్ ఎగ్ మసాలా కర్రీ, Egg Masala Curry Recipe Telugu, Dhaba Style Egg Curry, హోటల్ స్టైల్ ఎగ్ కర్రీ, Egg Curry Recipe in Telugu, స్పైసీ ఎగ్ కర్రీ, ఎగ్ గ్రేవీ రెసిపీ, Egg Masala Recipe, గుడ్డు కర్రీ రెసిపీ, గుడ్డు మసాలా కర్రీ, Easy Egg Curry Telugu, Pepper Egg Curry Recipe

ఈరోజు స్పెషల్ ఎగ్ మసాలా కర్రీని డాబా స్టైల్ లో ఎలా చేసుకోవచ్చో చెప్తాను. ఇంట్లో ఎగ్స్ తో కనుక ఈ కర్రీ చేస్తే గిన్నె ఖచ్చితంగా ఊడ్చాల్సిందే. అంత టేస్టీ గా ఉంటుంది. మీకు ఇమేజ్ లో టెక్చర్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు. బిర్యానీ, చపాతీ, పుల్కా, రైస్ ఇలా అది ఇది కాదండి ఎందులోకైనా ఈ ఎగ్ మసాలా కర్రీని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఎక్కువ గరం మసాలాలు వాడకుండా ట్రెడిషనల్ స్పైసెస్ నే ఇంట్రడ్యూస్ చేస్తూ స్పైసీగా టేస్టీగా ఈ ఎగ్ మసాలా కర్రీని చేసుకోవచ్చు. ఈ ఎగ్ మసాలా కర్రీతో పాటుగా ఎగ్స్ ని పర్ఫెక్ట్ గా ఎలా బాయిల్ చేసుకోవాలో కూడా టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను ఇంతవరకు ఎవ్వరు మీకు ఈ టిప్స్ చెప్పి ఉండరు. ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు గుడ్డు పైన ఉండే పెంకు రాకపోతే చాలా విసుగు వచ్చేస్తుంది కదా మీలో ఎంతమంది ఈ ఫ్రస్ట్రేషన్ ఫేస్ చేసి ఉన్నారు ఆ ఫ్రస్ట్రేషన్ కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. చిన్న టెక్నిక్ ఉంటుందండి. ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే అన్ని ఎగ్స్ కి కూడా చక్కగా షెల్ అనేది సపరేట్ అయిపోతుంది ఈజీగా.

కావాల్సిన పదార్థాలు :-

1. కోడి గుడ్లు – 6 లేదా 8

2. మిరియాలు – టీ స్పూన్

3. ధనియాలు – టీ స్పూన్

4. జీలకర్ర – అరా టీ స్పూన్

5. టమాటాలు – 2 లేదా 3

6. పాచ్చ్చిమిరపకాయలి – 5 లేదా 6

7. పుదీనా – 2 రెమ్మలు

8. కొత్తిమీర – పావు కప్పు

9. జీడీ పప్పు – 10 లేదా 12

10. పెరుగు – అరా కప్పు

11. నూనె – 4 టేబుల్ స్పూన్లు

12. కారం పొడి – 4 టేబుల్ స్పూన్లు

13. ఉప్పు – తగినంత

14. బట్టర్ – కొద్దిగా

15. ఉల్లిపాయలు – 3 పెద్దవి

16. అల్లం వెల్లుల్లి పేస్ట్ – కొద్దిగా

ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం :-

1. ఫస్ట్ మనం ఎగ్స్ ని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. మనం బాయిల్ చేసే ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి బయటకి తీసి ఇమ్మీడియట్ గా బాయిల్ చేయకూడదు. ఎగ్స్ బాయిల్ చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి నీళ్లుు పోసుకోండి.

2. గుడ్లు మునిగేటట్టుగా వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి. వాటర్ ని ఫస్ట్ మనం బాయిల్ చేయాలి మూత పెట్టి బాయిల్ చేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ డ్రాప్ చేయండి.

3. నేను ఆరు గుడ్లు తీసుకుంటున్నాను మీరు దాదాపు ఎనిమిది గుడ్లు దాకా తీసుకోవచ్చు ఈ క్వాంటిటీకి ఎగ్స్ వేసిన తర్వాత పైకి ఎగ్స్ గనుక తేలితే అవి చెడిపోయినట్టు అర్థం అన్నమాట వాటిని ఇమ్మీడియట్ గా తీసేయాలి. ఫ్రెష్ గా ఉంటే గనుక ఎగ్స్ అనేవి అడుక్కి వెళ్ళిపోతాయి.

4. వేడి నీళ్ళలోకి వేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు చిన్న నిమ్మ వక్క రసాన్ని అలాగే వక్క తో సహా పిండేసేసి అందులో వేసేసేయండి. ఇలా ఉప్పు నిమ్మరసం యాడ్ చేయడం వల్ల గుడ్డికి పైన ఉండే పెంకు ఈజీ గా సపరేట్ అయిపోతుంది అన్నమాట పెంకుకి అలాగే గుడ్డు సొనకి మధ్యలో ఒక చిన్న థిన్ లేయర్ ఉంటుంది,చూసారా తెల్లటి పొర ఉంటుంది ఆ పొర తెల్ల సొనకి అంటుకోకుండా ఉంటుందన్నమాట దానివల్ల గుడ్డు వలిచేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది.

5. గుడ్లు వేసిన తర్వాత జస్ట్ 8 మినిట్స్ నుంచి 10 మినిట్స్ పాటు బాయిల్ చేయాలండి మీడియం ఫ్లేమ్ లో అంతే అంతకన్నా ఎక్కువ బాయిల్ చేస్తే గుడ్డు ఓవర్గా బాయిల్ అయిపోతుంది అంత ఓవర్ గా బాయిల్ అయినా కూడా రబ్బరీ టెక్ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేశాక స్టవ్ ఆపేసేసి బాయిల్ చేసిన వాటర్ మొత్తాన్ని కూడా వంచేసుకోవాలి.

6. మళ్ళీ తిరిగి ఈ ఎగ్స్ లోకి టాప్ వాటర్ ని ఫిల్ చేయాలి. అంటే వేడి నీళ్ళలో అలా ఉంచేసేయకుండా చల్ల నీళ్లుు పోసుకోవాలన్నమాట.

7. ఇప్పుడు ఈ ఎగ్స్ ని ఒక్కొక్కటిగా తీసుకొని కొద్దిగా టాప్ చేస్తూ పైన ఉండే పెంకు ని తీసేసేయండి. తీస్తుంటే ఈజీ గా పెంకు సెపరేట్ అయిపోతుంది. సో ఈ టెక్నిక్ ఫాలో అయితే ఈజీగా అన్ని ఎగ్స్ కూడా నీట్ గా పెంకు అనేది సపరేట్ అయిపోతూ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఎగ్స్ కి ఉండే షెల్ మొత్తాన్ని కూడా తీసేసి ప్లేట్ లోకి తీసుకోవాలి.

8. ఒక్కొక్క ఎగ్ ని హాఫ్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ మసాలాలోకి కావలసిన స్పెషల్ మసాలా పౌడర్ ని తయారు చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా సోంపు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక టీస్పూన్ దాకా ధనియాలు అర టీస్పూన్ దాకా జీలకర్ర ఇవి వేసి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి.

9. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్ లో చిన్నవైతే మూడు పెద్దవయితే రెండు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కారానికి తగ్గట్టు 5 పచ్చిమిరపకాయలని వేసేసేయండి. ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకులు రెండు రెమ్మల పుదీనా ఆకులు పావు కప్పు దాకా కొత్తిమీరఎనిమిది నుంచి 10 దాకా జీడిపప్పు పలుకులు అరా కప్పు దాకా పెరుగు కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి.

10. ఇప్పుడు ఎగ్స్ ని కాస్త రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకోండి. బటర్ వేసి కొంచెం కరిగిన తర్వాత కట్ చేసుకున్న ఎగ్స్ ని ఇలా పచ్చ సొన పాన్ కి అంటే విధంగా బోర్లించి పెట్టండి. ఇలా అన్ని ఎగ్స్ ని కూడా ఉల్టా పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొంచెం ఉప్పు అలాగే మనం బ్లెండ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా అది కూడా కొద్దిగా వేసుకోవాలి అన్నీ కూడా ఒక పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ దాకా వేసుకోండి.

11. ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసి ఈ ఎగ్స్ ని వీటిలో ఈ మసాలాలో కాస్త రోస్ట్ చేయాలన్నమాట టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ 10 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది.

12. ఆ తర్వాత ఈ పాన్ ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి మూడు నుంచి2నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లి తరుగు వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు నూనెలో బాగా వేయించాలన్నమాట.
ఉల్లిపాయలు ఎంత వేగితే గ్రేవీ మీకు థిక్నెస్ అంత బాగుంటుంది. ఉల్లిపాయ అనేది గ్రేవీలో అసలు కనిపించకూడదు అలా కనిపించకుండా ఉండాలి అంటే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లా ఫ్రై చేసుకోవాలి.

13. ఇలా వేయించుకున్నాక ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయాలి నూనె పైకి తేలేంత వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి గరిటతో కలుపుతూ రోస్ట్ చేయండి ఇలా గ్రేవీ లో నుంచి నూనె పైకి తేలాలన్నమాట.

14. వేయించుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీస్పూన్ దాకా పసుపు అర టీస్పూన్ దాకా గరం మసాలా పౌడర్ అలాగే మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ లో కొంచెం సేపు ఫ్రై చేయాలి ఒక హాఫ్ మినిట్ పాటు.

15. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లుు వేసుకోండి నేను ఒక కప్పు దాకా వాటర్ ని వేస్తున్నాను నీళ్లు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి గ్రేవీ చక్కగా ఉడుకుతుంది ఆయిల్ సపరేట్ అవుతుంది.

16. ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసుకున్న ఎగ్స్ మొత్తాన్ని కూడా వేసేసేయాలి వీటితో పాటు ఒక రెండు పచ్చిమిరపకాయల్ని సగానికి విరుచుకొని వేసుకోండి ఒక టీస్పూన్ దాకా కసూరి మేతి వేయండి అలాగేరెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫలేమ లో ఉడికించండి సరిపోతుంది.

17. ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువ బాయిల్ చేయాల్సిన పనిలేదు ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ కడాయిని పక్కకు దించేసుకోండి.అంతే డాబా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. గ్రేవీ గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుందండి.

ఎగ్ మసాలా కర్రీ చిట్కాలు :-

* గుడ్లను ఫ్రిజ్ నుంచి వెంటనే తీసి ఉడికించకండి. ముందుగా రూమ్ టెంపరేచర్‌కు వచ్చాకే వేడి నీటిలో వేస్తే గుడ్లు బాగా ఉడుకుతాయి.

* గుడ్లు ఉడికించే నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేయండి. ఇలా చేస్తే గుడ్డు పెంకు చాలా సులభంగా ఊడిపోతుంది.

* గుడ్లను 8–10 నిమిషాలకంటే ఎక్కువ ఉడికించవద్దు. ఎక్కువసేపు ఉడికిస్తే గుడ్డు రబ్బరీ టెక్స్చర్‌కు మారి రుచి తగ్గుతుంది.

* గ్రేవీకి ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించండి. ఇలా చేస్తే గ్రేవీ చిక్కగా, డాబా స్టైల్ రుచితో తయారవుతుంది.

* గ్రేవీలో వేసే ముందు గుడ్లను బటర్‌లో మసాలాలతో రోస్ట్ చేయండి. దీంతో గుడ్లకు మసాలా బాగా పట్టి కర్రీ మరింత రుచిగా ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు :-

1. ఎగ్ మసాలా కర్రీకి గుడ్లను ఎంతసేపు ఉడికించాలి?
: మీడియం మంటపై 8 నుంచి 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.

2. గుడ్డు పెంకు ఈజీగా రావాలంటే ఏమి చేయాలి?
: ఉడికించే నీటిలో ఉప్పు, నిమ్మరసం వేసి, ఉడికిన వెంటనే చల్లటి నీటిలో వేస్తే పెంకు సులభంగా ఊడిపోతుంది.

3. ఈ ఎగ్ మసాలా కర్రీతో ఏవి సర్వ్ చేయవచ్చు?
: బిర్యానీ, చపాతీ, పుల్కా, అన్నం వంటి వాటితో ఎంతో రుచిగా ఉంటుంది.

4. ఈ కర్రీలో ప్రత్యేక రుచి రావడానికి ఏ మసాలా ఉపయోగిస్తారు?
: మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్రలను పొడిగా గ్రైండ్ చేసి వాడటం వల్ల ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది.

5. గ్రేవీలో గుడ్లు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాలా?
: లేదు. రోస్ట్ చేసిన గుడ్లను గ్రేవీలో వేసిన తర్వాత 2–3 నిమిషాలు మాత్రమే ఉడికిస్తే సరిపోతుంది.

ఈ విధంగా చేస్తే ఎగ్ మసాలా కర్రీ చాలా రుచిగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి.

Latest Recipes

Leave a Reply